ఆరు నెలల్లోనే ఫోన్ మార్చేస్తున్న భారతీయులు!

దేశంలోని మొబైల్ ఫోన్ యూజర్లలో సగం కంటే ఎక్కువ మంది ఆరు నెలల్లోనే కొత్త ఫోన్లవైపు చూస్తున్నారని రీసెర్చ్, ఇన్‌సైట్స్ అండ్ కన్జుమర్ సర్వే (ఆర్ఐసీఎస్) వెల్లడించింది. వీరిలో 65 శాతం నవ యువత ఉన్నారని సర్వే పేర్కొంది. పట్టణాల్లోని మొబైల్ వినియోగదారుల్లో దాదాపు 49 శాతం మంది యూజర్లు రూ.15వేల లోపు ఉన్న స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారట. దేశంలోని అన్ని వయసుల మొబైల్ యూజర్లపై నిర్వహించిన ఆన్‌‌లైన్ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. మొత్తం 2వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

భారత్‌లో మొబైల్ ఫోన్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండగా, చైనా మొబైల్ తయారీ సంస్థలు భారత మార్కెట్‌పై ఆధిపత్యం చలాయిస్తుండడం గమనార్హం. షియోమీ, శాంసంగ్, యాపిల్ తదితర ఫోన్లపై భారతీయులు మనసు పారేసుకుంటున్నారు. చైనా మొబైల్ బ్రాండ్స్ అయిన షియోమీ, వన్ ప్లస్, ఒప్పో, వివో, లెనోవో, హువేయి తదితర బ్రాండ్లు భారత మొబైల్ మార్కెట్లో 42 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకున్నాయి. చవక ధరలతో భారత మొబైల్ వినియోగదారులను చైనా మేకర్స్ ఆకర్షిస్తున్నట్టు సర్వేలో తేలింది.
రూ.40 వేలు, ఆపైన వెచ్చించి ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారు యాపిల్‌పై మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత స్థానంలో శాంసంగ్ ఉంది.

మొబైల్ యూజర్లలో చాలామంది బ్యాటరీ బ్యాకప్, సౌండ్ క్వాలిటీ, కెమెరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో వస్తున్న ఫేస్ రికగ్నిషన్, వైర్‌లెస్ చార్జింగ్ ఫోన్లు వారి ప్రాధాన్యంలో అట్టడుగున ఉండడం విశేషం.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 3 కోట్ల యూనిట్లు భారత మొబైల్ మార్కెట్లోకి దిగుమతి అయ్యాయి. ఈ త్రైమాసికంలో చైనా మొబైల్ దిగ్గజం షియోమీ అత్యధిక మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో నిలవగా, 4జీ ఫీచర్ ఫోన్లలో రిలయన్స్ జియో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*