ఆరంభంలోనే బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం

బెంగళూరు: బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ కలుపుకుంటూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటూ మొదలైన కేసీఆర్ వ్యూహం ఆరంభంలోనే బెడిసికొట్టింది. కర్ణాటక వెళ్లి మరీ తెలుగువారంతా జేడీఎస్‌కు ఓటెయ్యాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పాపం ఆయన మాట విని చాలామంది తెలుగువారు ఈ నెల 12న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి ఓటేశారు. ఈ నెల 15న ఫలితాలు వెలువడిన వెంటనే జేడీఎస్ అధినేత దేవెగౌడ కాంగ్రెస్ పార్టీతో జతకట్టేశారు. కాంగ్రెస్ గొప్ప పార్టీ అని కీర్తించారు కూడా. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత కూడా కాంగ్రెస్‌తో ముందే చేతులు కలిపి ఉంటే ఇంకా బాగుండేదని సూచించారు. దేవెగౌడ, మమత ఇచ్చిన షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేకపోతున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*