రేపే యడ్డీ బలపరీక్ష… సుప్రీం ఆదేశం

ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో రేపు బీజేపీ సిఎం యడ్యూరప్ప బలపరీక్ష జరగనుంది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాసపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ కోరినా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా కర్ణాటక వీడిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరిగి అర్జంటుగా బెంగళూరుకు పయనమయ్యారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఈ నెల 12న 222 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 15న విడుదలైన ఫలితాల్లో బీజేపీ 104 స్థానాలను గెలుచుకుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతిచ్చారు. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*