ఐపిఎల్ మ్యాచ్‌లను 7 గంటలకు ఎందుకు మార్చారో తెలుసా?

ఐపిఎల్ – 2018లో లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిసాయి. మొత్తం 56 మ్యాచ్‌లు జరగ్గా ప్రతీ టీం 14 చొప్పున మ్యాచ్‌లను ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లన్నీ సాయింత్రం నాలుగు గంటలకు గానీ లేదా రాత్రి ఎనిమిది గంటలకు గానీ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఇక జరగనున్న ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు మొదలు కానుంది. మరి ఈ ఆకస్మిక మార్పు ఎందుకు చేశారు? ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి వీక్షకుల సంఖ్య పడిపోవడం, రెండు జట్ల మధ్య సమానత తీసుకొచ్చేందుకు.

మొదటి కారణం చూస్తే రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతున్న మ్యాచ్‌లు ముగిసే సరికి 11 గంటలు దాటుతుంది. దీంతో ఆ సమయంలో మ్యాచ్‌లు చూడలేక చాలా మంది టీవీలు కట్టేసి పడుకుంటున్నారు. దీన్ని నివారించి మ్యాచ్ మొత్తం చూసేలా, మ్యాచ్ అనంతరం జరిగే ప్రజెంటేషన్, ఆటగాళ్ల స్పీచ్‌లను కూడా ఎంజాయ్ చేసేలా గంట ముందే మ్యాచ్‌లను మొదలుపెడుతున్నారు. అందులోనూ ఇవి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు కావడంతో ఐపిఎల్ వీక్షకుల్లో మరింత ఆసక్తి ఉటుంది. వారిన ఇబ్బంది పెట్టకుండా ఉండేందకు ఈ నిర్ణయం తీసుున్నారు.

రెండో కారణం చూస్తే రాత్రి ఎనిమది గంటలకు మదలయ్యే మ్యాచ్‌లలో రాత్రి సమయం ఎక్కువౌతున్న కొద్దీ తేమ ప్రభావం కూడా పెరుగుతుంది. దీని వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉటుంది. బంతి బౌలర్ల చేతి నుంచి జారడం, బ్యాట్‌పైకి బంతి చక్కగా చేరుతుండటంతో సెకండ్ బౌలింగ్ టీంకు ఇబ్బంది ఎదురవుతుంది. దీన్ని నివారించి ఇరు జట్లుకు సమాన అవకాశం ఉండేలా చేసేందుకు మ్యచ్ ప్రారంభ సమయాన్ని ఒక గంట ముందుు జరిపి ఏడు గంటలకు మొదలుపెడుతున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*