
ఐపిఎల్ – 2018లో లీగ్ మ్యాచ్‌లన్నీ అయిపోయాయి. తొలి రెండు స్థానాల్లో సన్‌రైజర్స్, చెన్నై జట్లు నిలవగా మూడు, నాలుగు స్థానాలకు తీవ్రమైన పోటీ నడిచింది. చివరికి మూడో స్థానంలో కోల్‌కతా, చివరి దశలో ముంబై, పంజాబ్ వైదొలగడంతో నాలుగో స్థానంలో రాజస్థాన్ జట్లు నిలిచాయి. ఇక మిగిలిది ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ మాత్రమే. కాబట్టి ఈ నేపథ్యంలో ఫైనల్ ఎవరి మధ్య జరుగుతుంది? ఎవరు ఫైనల్ గెలుస్తారు? అనే చర్చలు మొదలయ్యాయి.
మే 22న రాత్రి ఏడు గంటలకు క్వాలిఫెయిర్ – 1లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొడతాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ చూరుకుంటుంది. ఓడిన జట్టు క్వాలిఫెయర్ – 2 ఆడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా, రాజస్థాన్ జట్లు మే 25న ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్ – 1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్ – 2 ఆడాల్సి ఉంటుంది.
పలువురి అంచనాల ప్రకారం క్వాలిఫయర్ వన్‌లో చెన్నై గెలిచి ఫైనల్‌కు వెళుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచి క్వాలిఫెయర్ – 2లో సన్‌రైజర్స్‌తో ఢీ కొడుతుంది. ఇందులో గెలిచిన సన్‌రైజర్స్ ఫైనల్లో చెన్నైతో ఆడుతుంది. ఫైనల్లో ధోనీ సేన కప్ కొడుతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇది ఎక్కువ మంది అంచనా వేస్తున్నది మాత్రమే ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
This post is also available in : English
Be the first to comment