
అశ్లీల, చైల్డ్ పోర్న్ వీడియలోను అప్లోడ్ కాకుండా నిరోధించడంలో విఫలమైన యాహూ, ఫేస్బుక్ ఐర్లాండ్, ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియా, గూగుల్ ఇంక్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్‌లకు భారత అత్యున్నత న్యాయస్థానం చెరో లక్ష రూపాయల జరిమానా విధించింది. అశ్లీల వీడియోల నిరోధానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జరిమానా విధించింది. చైల్డ్ పోర్న్, హింసాత్మక అశ్లీల వీడియోలు నిరోధానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా జస్టిస్ మదన్ బి లోకూర్, ఉదయ్ ఉమేష్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 16న పైన పేర్కొన్న ఇంటర్నెట్ దిగ్గజాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, వారి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో స్పందించిన బెంచ్ జూన్ 15లోగా వారి స్పందనను తెలియజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్లతోపాటు జరిమానాగా స్వల్పకాలిక వ్యవధితో లక్ష రూపాయలను తక్షణం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
This post is also available in : English
Be the first to comment