జియోకు పోటీగా రూ.558 ప్యాక్ ప్రకటించిన ఎయిర్‌టెల్

రిలయన్స్ జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. జియో రూ.498 ప్యాక్‌కు పోటీగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.558 ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లో భాగంగా 82 రోజుల కాలపరిమితితో రూ.246 జీబీని అందిస్తోంది. అంటే రోజుకు 3జీబీ డేటా లభిస్తుందన్నమాట. అపరిమిత లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ సర్కిల్ పరిధిలోని వినియోగదారులు ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్యాక్‌‌ను కొనుగోలు చేసుకోవచ్చు. త్వరలోనే దేశం మొత్తం ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది.
ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో రూ.498 ప్యాక్‌లో భాగంగా వినియోగదారులకు 91 రోజుల కాలపరిమితితో 182 జీబీ 4జీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2జీబీ అన్నమాట.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*