టీమిండియాలో ఆ మార్పుకు కోహ్లీనే కారణం : రైనా

భారత క్రికెట్‌ను ధోనీకి ముందు ధోనీ తర్వాత అని ఎలా అంటారో కోహ్లీకి ముందు కోహ్లీకి తర్వాత అని కూడా అంటుంటారు. కోహ్లీ టీమిండియాలో కోహ్లీ చాలా మార్పులు తీసుకొచ్చాడు. అందులో ఒకటి ఫిట్‌నెస్. నిరంతరం జిమ్‌లో గడిపే కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ద తీసుకుంటాడు. అందుకే మైదానంలో బ్యాట్‌తో విజృంభింస్తుంటాడు. కోహ్లీని చూసి చాలా మంది ఫిట్‌నెస్‌ను అలవాటు చేసుకున్నారు. ఇదే విషయంపై సురేశ్ రైనా తాజాగా మాట్లాడుతూ తాను గత దశాబ్ధ కాలంగా టీమిండియాను చూస్తున్నానని, ఫిట్‌నెస్‌ విషయంలో చాలా శ్రద్ధ పెరిగిందని చెప్పాడు. అందుకు ముఖ్య కారణం కోహ్లీనేనని చెప్పాడు.

పది పన్నెండు సంవత్సరాల క్రితం తనకు మోకాలు సర్జరీ జరిగిందని అప్పుడు కోలుకోవడానికి తనకు ఏడు, ఎనిమిది నెలల సమయం పట్టిందని చెప్పాడు. అయితే ఇప్పుడు సెటప్ మారిందని రైనా చెప్పాడు. ఒక క్రికెటర్ బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌కు కూడా ప్రాముఖ్యత ఇచ్చే విధానాన్ని కోహ్లీనే తీసుకొచ్చాడని అన్నాడు. ఫీల్డింగ్ విషయంలో గతంలో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, తాను రాణించేవాళ్లమని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని జట్టులోని 11 మంది ఆటగాళ్లూ ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని రైనా అన్నాడు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*