ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోనందుకు ప్రీతీ జింటా వెరీ హ్యాపీ

ఐపిఎల్ – 2018లో అన్ని లీగ్ దశ మ్యాచ్‌లూ అయిపోయాయి. ఇక మిగిలింది ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ మాత్రమే. ప్లే ఆఫ్‌కు మొదట సన్‌రైజర్స్ జట్టు అర్హత సాధించగా, తర్వాత చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్ అర్హత సాధించాయి. నాలుగో స్థానం కోసం రాజస్థాన్‌,ముంబై, పంజాబ్ జట్లు మధ్య చివరి నిమిషం వరకూ పోటీ నడిచింది. మే 20న సాయింత్ర నాలుగు గంటలకు ఐపిఎల్ మ్యాచ్ నెంబర్ 55లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడి ప్లే ఆఫ్‌కు చేరుకోలేకపోయింది.

అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కూడా ఓడి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేక ఐపిఎల్ నుంచి వైదొలిగింది. అయితే పంజాబ్ జట్టు ఓడిపోతుందంటే చాలా విచారంగా కనిపించే ఆ జట్టు కో ఓనర్ ప్రీతి జింటా ధోనీ సేన చేతిలో పంజాబ్ ఇక ఓడిపోతుందనుకున్న సమయంలో మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపించింది. దీంతో ఆ సమయంలో ఆమె తన పక్కనే ఉన్న ఒక సీనియర్ పంజాబ్ జట్టు అధికారితో మాట్లాడారు.

ఏం మాట్లాడి ఉంటారనే దానిపై ఆమె లిప్‌ను రీడ్ చేస్తూ పలువురు నెటిజన్లు సోషల్ మీడయిలో కామెంట్లు పెడుతున్నారు. మన జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకోకపోయానా పర్వాలేదు కానీ ముంబై కూడా ప్లే ఆఫ్‌కు చేరుకోలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రీతీ ఆ పక్కనున్న అధికారితో చెపపినట్టు కామెంట్లు వస్తున్నాయి. కానీ నిజానికి ఆమె అలా చెప్పలేదు. అసలు ఆమె ఏం చెప్పిందో తెలియదు కానీ పలువురు పై విధంగా కామెంట్లు చేసిందనడం, సదరు వీడియో సోషల్ మాడియాలో వైరల్‌గా మారాయి.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*