జియోకు పోటీగా రూ.499 ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

టెలికం రంగంలో జియో నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్, ఐడియాలు ఇప్పటికే ప్లాన్లు ప్రకటించగా, ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. నెలకు 45 జీబీతో రూ.499 పోస్టు పెయిడ్ పథకాన్ని తీసుకొచ్చింది. ‘డాటా సునామీ’ పేరుతో ఆఫర్ ప్రకటించిన మరునాడే మరో ప్లాన్ ప్రకటించడం గమనార్హం. నెలకు 45 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఈ ప్లాన్‌లో లభిస్తాయి. రిలయన్స్ జియో రూ.509 ప్లాన్‌కు కౌంటర్‌గా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ప్రకటించింది.

జియో రూ.509 ప్లాన్‌లో రోజుకు 2జీబీ చొప్పున నెలకు 60 జీబీ డేటా లభిస్తుంది. మార్చిలో ఎయిర్‌టెల్ రూ.499 పోస్టు పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు నెలకు 40 జీబీ డేటా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. అలాగే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వొడాఫోన్, ఐడియాలు కూడా నెలకు 40 జీబీ డేటాతో రూ.499 ప్లాన్‌లు ప్రకటించాయి. బీఎస్ఎన్ఎల్ తాజా రూ.499 ప్యాక్‌లో డేటా రోల్ ఓవర్ సౌకర్యం లేదు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*