తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న పవన్

పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రను శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాడు. ఇచ్చాపురంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మీ ఆశీర్వాదంతో సీఎం అవుతానని చెప్పారు. అంతకుముందే అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి టీడీపీ, వైసీపీలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో మాట్లాడినప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీని విమర్శిస్తున్న సమయంలో ఆయన చూపించిన హావభావాలు హైలెట్‌గా మారాయి.

మరీ ముఖ్యంగా ఆయన మాట్లడుతూ.. జనసేన వాళ్లదేముందండీ వాళ్లకు కొన్ని బిస్కెట్లే పడేస్తే చాలా వెనకల తిరుగుతారు, ఒక 15 సీట్లు పడేస్తే చాలని వారన్న మాట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాట చెప్పిన వెంటనే అలా మనల్ని అంటే మనకు కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? అని పదే పదే ప్రవ్నిస్తూ ఊగిపోయారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్‌కు లోపల చాలా కోపం ఉందని, దాన్ని దాన్ని పూర్తిగా బయటపడనీయకుండా కంట్రోల్ చేసుకుంటున్నారనే చర్చ మొదలైంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*