
ఐపిఎల్ – 2018 మ్యాచ్ నెంబర్ 56లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ధోనీ సేన ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఐతే మ్యాచ్ అనంతరం ధోనీ తన కూతురు జీవాతో కలిసి ఆడకుంటూ సంతోషంగా గడిపాడు. మోకాళ్లపై కూర్చుని చేతులను నేలపై ఉంచి కూతురు వంక చూస్తూ ఉంటే, జీవా ఏమో నవ్వుతూ, కేరింతలు కొడుతూ తండ్రితో ఆడుకుంది. ధోనీ తలపై ఉన్న టోపీతో ఆడుకుంది.
నవ్వుతూ, గెంతుతూ, చేతులు పైకెత్తి సరదాగా అటు ఇటూ పరిగెత్తింది. కూతుర్ని చూసుకుని ధోనీ సంతోషంగా గడిపాడు. ఇలా కూతురు జీవాతో ధోనీ గడిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌పై ధోనీ సేన నెగ్గడంతో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. మే 22 రాత్రి ఏడు గంటలకు ధోనీ సేన సన్‌రైజర్స్‌తో క్వాలిఫెయర్ – 1 ఆడనుంది. ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లాడిన ధోనీ 89.20 యావరేజ్‌తో 446 పరుగులు చేశాడు.
This post is also available in : English
Be the first to comment