సన్‌రైజర్స్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలతో ఎందుకు ఆడారు?

ఆటలో గెలిచామా ఓడామా అనేదానికంటే గెలిచేందుకు చివరి వరకూ ప్రయత్నించామా లేదా అనేదే ముఖ్యం. క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆ విధంగానే ఆడింది. క్రికెట్ ఒక జాతి మొత్తాన్ని ఏకం చేయగలదు. క్వాలిఫయర్ – 1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించుకుని మైదానంలోకి వచ్చారు. అందుకు ఒక ప్రత్యేక కారణముంది. ఎవరైనా చనిపోతే మనం సహజంగా ఏం చేస్తా? సంతాపం ప్రకటిస్తాం లేదా మౌనం పాటిస్తాం. ఇప్పుడు అదే తీరులో సన్‌రైజర్స్ ఆటగాళ్లు ప్రవర్తించారు.

ఆఫ్గనిస్తాన్‌లోని నన్‌గర్హర్ ప్రాంతంలో దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండగా బాంబు పేలింది. ఇందులో 8 మంది చనిపోగా 45 మంది వరకూ గయపడ్డారు. దీంతో వారికి సంతాపంగా నివాళులర్పిస్తూ సన్‌రైజర్స్ ఆటగాళ్లు వారి చేతికి నల్ల బ్యాడ్జీలను ధరించి గేమ్ ఆడారు. సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఆఫ్గనిస్థాన్ దేశస్థుడే. మరో ఆఫ్గనిస్థాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ కూడా సన్‌రైజర్స్‌ టీంలో ఉన్నాడు. ఐపిఎల్ తర్వాత కొద్ది రోజుల్లో ఆఫ్గనిస్థాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. బెంగళూరులో టీమిండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. క్వాలిఫయర్ – 1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడగా ధోనీ సేన రెండు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*