
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగుల యంత్రం అని, సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ అని అభిమానులు పిలుచుకుంటారు. మైదనాంలోపరుగులు వరద పారిస్తాడు. అయితే మైదానంలో తన బ్యాటింగ్‌కు, ఫీల్డింగ్‌కు ఎంత ప్రాముఖ్యతనిస్తాడో తన ఫిట్‌నెస్‌పై కూడా అంతే ప్రాముఖ్యతనిస్తాడు. ఫిట్‌నెస్‌పై అంత శ్రద్ధ తీసుకుంటాడు కాబట్టే మైదానంలో పరుగుల వరద పారిస్తూ పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే వెటరన్ టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో జట్టు సభ్యులందరిలో సంచలన మార్పు తీసుకొచ్చాడని, ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రమే అలా ఉండేవారని చెప్పాడు.
అయితే తాజాగా కోహ్లీ ఇప్పుడు ట్విట్టర్లో ఫిట్నెస్ ఛాలెంజ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. భారత క్రీడా శాఖ మంత్రి రాజవర్ధన్ రాథోడ్ చేసిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని చెప్పాడు. ఈ చాలెంజ్‌ను తన భార్య అనుష్క శర్మ, ప్రధాని మోడీ, ధోనీ స్వీకరించాలని కోరాడు. దీంతో పాటు తాను వర్కౌట్ చేసిన ఒక వీడియోను కూడా జత చేసి మీరు కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని అభిమానులను కోరాడు. అయితే ఈ ట్విట్‌కు ప్రధాని మోడీ స్పందిస్తూ ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్టు చెప్పారు. త్వరలో తాను కూడా తన ఫిట్నెస్ వీడియోను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
This post is also available in : English
Be the first to comment