డెవిలియర్స్ ఎందుకు ఒక అద్భుతం?

అంతర్జీతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని డెవిలియర్స్ ఒక వీడియో ద్వారా ప్రకటించాడు. ట్విట్టర్‌‌లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో పోస్ట్ అయిన వెంటనే క్రికెట్ ప్రపంచమంతా విచారంలో ముగినిపోయింది. అతని రికార్డులు, సెంచరీలు కంటే కూడా క్రికెటర్లు, ప్రేక్షకులపై అతను కలిగించిన ప్రభావం ఒక అద్భుతం. అతను బ్యాటింగ్‌కు మైదానంలో అడుగు పెట్టాడంటే బౌలర్ల గుండెల్లో భయం మొదలయ్యేది. తోటి బ్యాట్స్‌మెన్ అతని నుంచి స్ఫూర్తి పొందేవారు.

డెవిలియర్స్ సౌతాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీట్వంటీలు ఆడాడు. భారత్, ఇస్ట్రేలియాపై అద్భుతమైన టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించిన తర్వాత తన రిటైర్మెంట్‌కు సరైన సమయంగా భావిస్తున్నట్టు చెప్పాడు. తాను చాలా అలిసిపోయినట్టు ఫీలవుతున్నానని చెప్పాడు. తనకు సహకరించిన తోటి జట్టు సభ్యులకు, కోచ్‌లకు, క్రికెట్ సౌతాఫ్రికా స్టాఫ్‌కు కృతజ్ఞతలని చెప్పడు. అయితే తాను దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడు.

డెవిలియర్స్ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. సౌతాఫ్రికా తరుపున 114 టెస్టులు ఆడి 8765 పరుగులు, 228 వన్డేలు ఆడి 9577 పరుగులు, 78 టీట్వంటీలు ఆడి 1672 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ డెవిలియర్స్. మరో సౌతాఫ్రికా వెటరన్ క్రికెటర్ అయిన జాక్వస్ కలీస్ మాత్రమే డెవిలియర్స్ కన్నా ఎక్కువగా 11579 పరుగులు చేశాడు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*