
దేశంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికం నెట్వర్క్ను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో 4,072 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
తొలివిడతలో ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లలో రూ.3,167 కోట్ల ఖర్చుతో రెండేళ్ల వ్యవధిలో 2,329 టవర్లను ఏర్పాటు చేయనున్నారు. టవర్ల నిర్వహణ ఖర్చు ఈ ప్రాజెక్టులో భాగమేనని అధికారులు తెలిపారు.
మొత్తం 4,072 మొబైల్ టవర్లలో 1,054 టవర్లను జార్ఖండ్లో, 1,028 టవర్లను చత్తీస్గఢ్, ఒడిశాలో 483, ఆంధ్రప్రదేశ్లో 429, బీహార్లో 412, పశ్చిమబెంగాల్లో 207, ఉత్తరప్రదేశ్లో 179, మహారాష్ట్రలో 136, తెలంగాణలో 118, మధ్యప్రదేశ్లో 26 ఏర్పాటు చేయనున్నారు.
This post is also available in : English
Be the first to comment