
షియోమీ రెడ్మీ నోట్ 5, ఆనర్ 9 లైట్ ఫోన్లకు పోటీగా మరో మొబైల్ మార్కెట్లోకి వచ్చేసింది. చైనాకు చెందిన మరో మొబైల్ బ్రాండ్ కోమియో.. కోమియో ఎక్స్1 నోట్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూయల్ కెమెరా, ఫేసియల్ రికగ్నిషన్, మిర్రర్ ఫినిష్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.
రాయల్ బ్లూ, సన్‌రైజ్ గోల్డ్ కలర్ వేరియంట్లతో వస్తున్న ఈ ఫోన్‌కు 465 రోజుల వారంటీ కూడా ప్రకటించింది. వన్ టైమ్ స్క్రీన్ బ్రేకేజ్ వారంటీతోపాటు 30 రోజుల రీప్లేస్మెంట్ కూడా ఇస్తున్నట్టు తెలిపింది. కొమియో ఎక్స్1 ధర భారత్‌లో రూ.9,999. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లతోపాటు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్ అయిన స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, షాప్‌క్లూస్, పేటీఎంలలోనూ లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు: 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్, 3జీబీ ర్యామ్, 13+5 మెగాపిక్సల్ రియర్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ప్రీలోడెడ్ కెమెరా మోడల్స్, 32 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.
This post is also available in : English
Be the first to comment