
క్రికెట్ అంటే సినిమా వాళ్లకు కూడా చాలా ఆసక్తి ఉటుంది. అందులో ఐపిఎల్ అంటే ఇంకా ఆసక్తిగా ఉంటారు. మన తెలుగు వారి సంగతి చూస్తే వెంకటేశ్ వంటి వారు సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కూ మిస్ కాకుండా హాజరవుతారు. అయితే ఎప్పుడూ సినిమాకు సంబంధంలేని విషయాలను పెద్దగా మాట్లాడని మహేశ్ ఏం చేశాడో తెలుసా? అందులోనూ ఐపిఎల్‌పై చాలా ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ అద్భుతమని కీర్తించాడు. క్వాలిఫయర్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ సన్‌రైజర్స్ ప్రదర్శన చాలా బాగుందని ట్విట్టర్లో కామెంట్ చేశారు.
ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. తెలుగు వారికి, అందులోనూ క్రికెట్ అభిమానులకు మహేశ్ బాబు చేసిన ఈ కామెంట్ ఆసక్తిగా అనిపిస్తే అందుకు రషీద్ ఖాన్ ఇచ్చిన రిప్లై మరింత ఆసక్తిగా అనిపించాయి. రషీద్ ట్విట్టర్లో మహేశ్‌కు రిప్లై ఇస్తూ థ్యాంక్యూ బ్రో, మీ సినిమాలను చాలా శ్రద్ధగా చూస్తుంటానని అన్నాడు. దీంతో వీరిద్దరి ఈ ట్విట్టర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతా చెన్నైతో జరిగే ఫైనల్ కోసం ఎదురు చూస్తున్నారు.
క్వాలిఫయర్ – 2 మ్యాచ్‌లో కోల్‌కతాపై సన్ర్స్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇందులో రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో పది బంతుల్లోనే 34 పరుగులు చేసిన రషీద్ అనంతరం బౌలింగ్‌లో నాలుగు ఓవర్లకు 19 పరుగులిచ్చి కీలక వికెట్లు తీశాడు. అంతే కాడు రెండు కీలక క్యాచ్‌లను అందుకుని, ఒక ముఖ్యమైన రనౌట్ కూడా చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కి ఒంటి చేత్తే చేర్చాడు. అందుకే రషీద్ ఖాన్‌ను అందరూ పొగుడుతుంటే వారితో పాటు మహేశ్ బాబు జత కలిశాడు.
This post is also available in : English
Be the first to comment