
హైదరాబాద్: మాదాల రంగారావు(70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4:41 గంటలకు కన్నుమూశారు. ఫిల్మ్ నగర్లోని ఇంటికి మాదాల రవి ఇంటికి భౌతికకాయాన్ని తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మైనంపాడులో 1946 మే 25న ఆయన జన్మించారు. 1980వ దశకంలో రంగారావు తన సినిమాలతో యువతరాన్ని కదిల్చారు. యువతరం కదిలింది, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, విప్లవ శంఖం, బలిపీఠంపై భారత నారి, తొలిపొద్దు, ఎర్రపావురాలు, జనం మనం, ప్రజాశక్తి, స్వరాజ్యం, నవోదయం వంటి సినిమాల్లో నటించారు. 70కి పైగా సినిమాల్లో నటించిన మాదాల 15 సినిమాలు నిర్మించారు. మాదాల రంగారావు మృతికి ఏపీ సిఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. సామాజిక, రాజకీయ రంగాల్లోని చీకటి కోణాలను మాదాల రంగారావు తన సినిమాల్లో ఎండగట్టారని కీర్తించారు.
This post is also available in : English
Be the first to comment