సన్‌రైజర్స్ X చెన్నై ఫైనల్ పోరులో గెలుపెవరిది?

ఐపిఎల్ – 2018లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్లే ఫైనల్‌కు చేరాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కప్ కోసం ఢీ కొట్టబోతున్నాయి. మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. ధోనీ సేనకు బ్యాటింగ్ బలం ఉంటే సన్‌రైజర్స్‌కు బౌలింగ్ బలం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య భీకర పోరును చూడబోతున్నాం. కెప్టెన్సీ, బ్యాటింగ్‌లో ధోనీకి, విలియమ్సన్‌కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇరు జట్లకు ప్రధాన తేడా రషీద్ ఖాన్‌. అతన్ని చెన్నై టీం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో ధావన్, విలియమ్సన్ కాకుండా మిగతా వారు పెద్దగా రాణించడం లేదు.

ముఖ్యంగా సాహా, మనీష్ పాండే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అయితే మిడిల్ ఆర్డర్‌లో షకీబుల్ హాసన్, యూసఫ్ పఠాన్, లోయర్ ఆర్డర్‌లో బ్రాత్‌వైట్, రషీద్ ఖాన్ ఆకట్టుకుంటున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ధోనికి ధీటైన బ్యాట్స్‌మెన్ సన్‌రైజర్స్‌లో లేరు. ప్రస్తుతం 11వ ఐపిఎల్ ఫైనల్ జరుగుతుండగా చెన్నైకు ఇది 7వ ఫైనల్ మ్యాచ్. గతంలో వరుసగా 2010, 2011లో టైటిల్ నెగ్గి మూడోసారి నెగ్గేందుకు చూస్తున్నారు. సన్‌రైజర్స్ విషయానికొస్తే 2016లో టైటిల్ కొట్టారు. ఇప్పుడు రెండోసారి కప్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము ధోనీ కోసం కప్ గెలుస్తామని సెంటిమెంట్‌గా చెప్పిన చెన్నై టీం చెప్పింది. ఐపిఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు తలపడగా రెండుసార్లు సన్‌రైజర్స్ ఏడు సార్లు చెన్నై గెలిచాయి.

అనుభవం ఉన్న ఆటగాళ్లతో నిండి ఉన్న ధోనీ టీంను ఎదుర్కొనేందుకు సన్‌రైజర్స్ జట్టు రషీద్ ఖాన్‌ను సిద్ధం చేస్తోంది. వాంఖడే పిచ్‌ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ బంతి స్పిన్ తిరిగే అవకాశం ఉండటంతో ఇరు జట్ల స్పిన్నర్లుకు ఉపయోగం ఉంటుంది. గెలిచే అవకాశాలు రెండు జట్లకు సమానంగా ఉన్నాయి. కానీ బలాల పరంగా చూస్తే ధోనీ టీం కొద్దిగా బెటర్‌గా ఉంది. అయితే మ్యాచ్ ఏ క్షణంలో అయినా కీలక మలుపు తీసుకోవచ్చు. ఆ టైంలో సెకండ్ బౌలింగ్ చేసే కెప్టెన్ మైదానంలో అమలు చేసే ప్లాన్‌ను బట్టి కూడా ఫలితం మారుతుంది. చివరి బంతి వరకూ టెన్షన్‌గా సాగే చాన్స్ ఉండటంతో ఆ ఒత్తిడి సమయంలో ఎవరు బెటర్‌గా రాణిస్తే వారిదే పై చేయి అవుతుంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*