మోత్కుపల్లి కన్నీరు మున్నీరు

హైదరాబాద్: నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు వంద కోట్ల రూపాయలకు రాజ్యసభ టికెట్లు అమ్ముకున్నారని, పోలవరం పనుల్లో వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పవన్, జగన్ సొంత జెండా పెట్టుకున్నారని, వాళ్లిద్దరూ మొగోళ్లని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ నుంచి టీడీపీ జెండాను లాక్కున్నారని మోత్కుపల్లి గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ చర్యలు తీసుకోవాలని, చంద్రబాబు కేసీఆర్‌కు సరెండర్ అయిపోయారని చెప్పారు. తెలంగాణాలో టీడీపీని నందమూరి వంశానికి అప్పజెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*