తాళపత్ర గ్రంథం ఆదారంగా “అంతేర్వేదమ్”

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం “అంతేర్వేదమ్” .చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం
పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్ధమైంది, జూన్ రెండవ వారం లో ట్రైలర్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలు జరగనున్నాయి.

దర్శకుడు రవికొషోర్ మాట్లాడుతూ.మనిషి చనిపోయినప్పుడు,నిద్రపోయినప్పుడు,కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది ? ఈ మూడు దశల్లో శరీరం నుంచి బయటకు వెళ్లిన ఆత్మలు ఎక్కడ కలుస్తాయి..? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి చనిపోయిన వారిని,మనకి తెలియనివారిని కలిసి వస్తుందా ? దీనినే మనం “కల” అనుకుంటునామా ? … ఇలాంటి విషయాలు అన్ని వ్రాసి ఉన్న తాళపత్ర గ్రంధం పేరే “అంతేర్వేదం”. ఆ తాళపత్ర గ్రంధం ఆధారంగా నిర్మించిన చిత్రమే “అంతేర్వేదమ్” అన్నారు.

అమర్,సంతోషి,శాలు చౌరస్య,తనికెళ్ళ భరణి,పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్ ,దొరబాబు,రవి,లడ్డు,యోగి తదితరులు నటించిన చిత్రానికి చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్ గా జె.యెస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*