
ఆగ్రా: కోతులబెడద తీవ్రంగా ఉండే ఆగ్రాలో ఓ కోతి.. బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్తోన్న తండ్రీ కూతుళ్ల వద్ద నుంచి 2 లక్షల రూపాయలున్న బ్యాగ్‌ను లాక్కుపోయింది. బ్యాగ్‌ను చించివేసి అందులో ఉన్న నోట్లను చెల్లాచెదురుగా పడేసింది. డబ్బుల సంచి రాబట్టేందుకు స్థానికులు, బ్యాంక్ సిబ్బంది ఆహార పదార్ధాలు, పండ్లు ఎరవేసినా కోతిబావ ఇవ్వలేదు. డబ్బు సంచితో అక్కడి నుంచి ఉడాయించింది. చెల్లాచెదురుగా పడేసిన 60 వేల రూపాయలు కష్టపడి ఏరుకున్నా లక్షా నలభై వేలు మాత్రం కోతి ఎత్తుకుపోయింది. చిన్న నగల దుకాణం ద్వారా కష్టపడి సంపాదించుకున్న డబ్బును కోతి ఎత్తుకుపోవడంపై బాధితుడు బన్సల్ లబోదిబోమంటున్నాడు. పోలీసులను ఆశ్రయిస్తే కోతిపై కేసు పెట్టే అవకాశం ఉందో లేదో చెప్పలేమంటున్నారు.
Be the first to comment