
ఐపిఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫైనల్ నెగ్గిన తర్వాత నగరంలోని క్రైనీ ప్లాజా హోటల్‌కి వచ్చిన వారికి చెన్నై టీం అధికారులు పూలమాలలు వేసి సాదర స్వాగతం పలికారు. చెన్నై టీం ఫ్రాంచైజీ అయిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ వారికి ఎదురెళ్లి ఆహ్వానించారు. నైట్ జరిగిన డిన్నర్లో జట్టు సభ్యులంతా పాల్గొన్నారు. పలువురు ఆటగాళ్లు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చెన్నై టీం అధికారులతో కలిసి జట్టు సీఈఓ విశ్వనాథన్ ఐపిఎల్ ట్రోఫీని నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో ఉన్న వెంకటేవ్వర స్వామి ప్రతిమ ముందు ఉంచారు. తమ అభిమాన జట్టు సభ్యులను చూసేందుకు హోటల్‌కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు. వారిలో కొంతమంది మాట్లాడుతూ తమ జట్టు చెన్నైలో ఆడలేకపోయినప్పటికీ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
This post is also available in : English
Be the first to comment