
ఆఫ్టనిస్థాన్‌తో ఆడబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. భారత పర్యటనకు రాబోతున్న ఆఫ్గనిస్థాన్ జట్టు టీమిండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. 25 టెస్టులు ఆడిన రోహిత్ 39.97 యావరేజ్‌తో 1479 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్ సరిగా రాణించనందుకే ఆఫ్గనిస్థాన్‌పై మ్యాచ్‌లో పక్కన పెట్టారు. అయితే రోహిత్‌కు వన్డేల్లో మంచి రికార్డ్ ఉంది కానీ టెస్టుల్లో లేదు.
దీంతో పాలా టెస్టుల్లో అవకాశాలు తగ్గుతుండటంపై రోహిత్ శర్మ విభిన్నంగా స్పందించాడు. క్రికెట్లో ఎవరికైనా చాలా తక్కువగానే కెరీర్ ఉంటుందని, అందులో తన కెరీర్ ఇప్పటికే సగం ముగిసిందని అన్నాడు. ఇలాంటి సమయంలో తాను టెస్ట్ రికార్డులు, ఎంపిక కావడం గురించి ఆలోచించలేనని చెప్పాడు. తాను ఎందుకు ఎంపిక కాలేదనే కారణాలు వెతుక్కునే స్టేజ్‌లో తాను లేనని అన్నాడు. తన మిగిలిన సగం క్రికెట్ కెరీర్‌ను ఎంత బాగా వినియోగించుకోవాలనేదే తన ఆలోచనని వివరించాడు.
This post is also available in : English
Be the first to comment