
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జే4ను భారత మార్కెట్లోకి సైలెంట్‌గా విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.9,990. సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్న జే4లో ఆండ్రాయిడ్ ఓరియా ఓఎస్ వినియోగించారు. ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దీనిని తయారుచేయడం విశేషం.
స్పెసిఫికేషన్లు: 5.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 13 మెగాపిక్సల్ రియర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 16జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 256 జీబీ వరకు అంతర్గత మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ 20 గంటలు వస్తుంది. గతంలో విడుదల చేసిన గెలాక్సీ జే6, గెలాక్సీ ఎ6 సిరీస్లలా కాకుండా గెలాక్సీ జే4లో ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగించారు.
Be the first to comment