ఆర్జీవీ ట్వీట్లపై స్పందించిన నాగార్జున

దర్శకుడు రాం గోపాల్ వర్మ తన ట్వీట్లు, కామెంట్లతో నిరంతరం సంచలనంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్‌కు సంబంధించి, శ్రీరెడ్డి వ్యవహారం జరిగిన సమయంలో చేసిన ట్వీట్లు, వ్యక్తపరిచిన అభిప్రాయాలు దుమారాన్ని రేపాయి. ఆ సమయంలో వర్మ నాగార్జున ప్రధాన పాత్రలో ఉన్న ‘ఆఫీసర్’ మూవీని చిత్రిస్తున్నాడు. దీంతో వర్మ ట్వీట్లపై వర్మకు, నాగర్జునకు మధ్య ఏమైనా చర్చ జరిగిందా?

వారు ఏమైనా మాట్లాడుకున్నారా? అనే ప్రవ్నలు అప్పట్లో వచ్చాయి. అయితే తాజాగా ఆఫీసర్ ప్రి రిలీజ్ ఫంక్షన్‌ సందర్భంగా వర్మ ట్వీట్ల గురించి నాగార్జున స్పందించారు. తమ మధ్య అలాంటి చర్చ ఏదీ జరగలేదని, వర్మ వ్యక్తిగత విషయాల గురించి తాను పట్టించుకోనని చెప్పాడు. నిజానికి తాన వ్యక్తిగత విషయాల్లో కూడా ఎవరిని ఎంటర్ కానివ్వనని నాగ్ చెప్పారు. తన పిల్లలు చే, అఖిల్ విషయంలో కూడా తాను ఇలా చెయ్, అలా చెయ్ అని చెప్పనని అన్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*