
న్యాచురల్ స్టార్ నాని కథల ఎంపిక విషయంలోనే కాదు, ప్రతి సినిమాలోనూ ఏదొక విభిన్నతను జోడించుకుంటూ వెళుతున్నాడు. తనదైన స్టైల్లో ప్రేక్షకులను అరిస్తున్న నాని రీసెంట్గా కృష్ణార్జున యుద్దం సినిమా ద్వారా సరికొత్త ప్రయోగం చేశాడు. రాయలసీమ స్లాంగ్‌తో థియేటర్లో కేక పుట్టించాడు. అతని నటనకు యాస కూడా సెట్ కావడంతో నాని స్టైల్ సినిమాలో క్లిక్ అయ్యింది. అయతే ఇప్పుడు నాని చేసిన ఆ ఫీట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సవాల్‌గా మారింది.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కబోతున్న అరవింద సమేత సినిమాలో యంగ్ టైగర్ రాయలసీమ యాసలో డైలాగులు పలకబోతున్నాడట. ఇప్పటికే అదుర్స్, జై లవకుశ వంటి సినిమాల్లో విభిన్న డైలాగ్ డెలవరీ చేసి ఎన్టీఆర్ మెప్పించాడు. ఇక ఈ రాయలసీమ యాసను కూడా తేలికగానే చేయగలడని ఫ్యాన్స్ అంటున్నారు. అయినప్పటికీ త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్‌కు రాయలసీమ యాసను నేర్పేందుకు అందులో నిపుణుడైన పెంచల్ దాసును రప్పించాడు.
మరి ఇప్పటికే కృష్ణార్జున యుద్ధంలో రాయలసీమ డిక్షన్‌ను పలకడంలో సక్సెస్ అయిన నానికి ధీటుగా ఎన్టీఆర్ అరవింద సమేతలో ఎంత విభిన్నంగా నటిస్తాడో, ఎంత విభిన్నంగా డైలాగ్ డిక్షన్‌ను చూపిస్తారో అనే ఆసక్తి నెలకొంది. నాని చిత్తూరు జిల్లా స్లాంగ్‌ను చక్కగా పలికించగా మరి ఎన్టీర్ సీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో ఏ జిల్లా స్లాంగ్‌ను వాడబోతున్నాడో చూడాలి.
This post is also available in : English
Be the first to comment