
రంగస్థలం సినిమాతో పెద్ద హిట్ కొట్టిన రాం చరణ్ తర్వాత సినిమాను సంచలన దర్శకుడు బోయపాటితో తీస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్సి 12గా పిలవబడుతున్న ఈ మూవీలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబోరాయ్, స్నేమా, ఆర్యన్ రాజేశ్‌లు ప్రముఖ పాత్రల్లో నటించబోతున్నారు. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా టైటిల్ ఖరారుపై చాలా ఆసక్తి నెలకొంది. ఈ పాటికే చాలా పేర్లను అనుకున్నప్పటికీ ఇంకా ఖరారు చేయలేదు.
అయితే తండ్రి మెగాస్టార్ గతంలో నటించిన జగదీకవీరుడు అతిలోక సుందరి మూవీ నుంచి జగదీకవీరుడు పేరును నిర్ణయించేందుకు ఆలోచన చేస్తున్నారట. మరి ఇదే పేరును ఖరారు చేస్తారో లేక మరో పేరును ప్రకటిస్తారో మరికొన్ని రోజుల్లో తెలవనుంది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కొద్దిరోజుల క్రితమే బ్యాంకాక్‌లో జరిగింది. అయితే ప్రస్తుతమున్న సమాచారం మేరకు మూవీ తర్వాత షూటింగ్ జూన్ 12 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దసరా పండుగ సందర్భంగా మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.
This post is also available in : English
Be the first to comment