నాగ చైతన్య చేతిపై ఉన్న ఈ టాటూ అర్ధమేమిటి?

ఏం మాయ చేశావే సినిమా నుంచే నాగ చైతన్య, సమంతల మధ్య ప్రేమ చిగురించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు అభిమానం చూపించుకుంటూ వచ్చారు. పెళ్లి తర్వాత అది ఇంకా పెరిగింది. తాజాగా నాగ చైతన్యను చూస్తే అది మరొకసారి తెలుస్తోంది. వర్మ దర్శకత్వంలో చే తండ్రి అక్కినేని నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చైతన్య కూడా హాజరయ్యాడు.

అయితే చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు కానీ చే చేతిపై ఒక టాటూ ఉంది. ఇప్పుడదే చర్చనీయాంశంగా మారింది. పలువురు ఆ టాటూను తీక్షణంగా పరిశీలించి దాని అర్ధం ఏమై ఉంటుందొనని అంచనాలు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే ఇందులో ఒక అభిమాని చెప్పిన అభిప్రాయానికి చే భార్య సమంత స్పందించింది. ఆ అభిమాని ఏమన్నాడంటే చైతన్య చేతిపై ఉన్న టాటూ వారి పెళ్లి తేదీ(6-10-17) అని చెప్పాడు.

ఒకవేళ తాను తప్పైతే కరెక్ట్ చేయమని కూడా అన్నాడు. ఇందుకు సమంత స్పందిస్తూ “వావ్, నీకు ఆ టాటూ మీద చాలా ఆసక్తి కలిగింది కదా.. కలగలేదా?” అని ప్రశ్నించింది. అయితే ఆ టాటూకి అర్ధం అదేనా కాదా అనేది మాత్రం ఆమె చెప్పలేదు. మరి ఆ టాటూ ఏంటనేది చేగానీ, సమంత గానీ బయటపెడితే బాగుండు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*