మోదీ మాటలకు మోసపోయా: చంద్రబాబు

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో అందరినీ మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మాటలకు అందరిలాగే తానూ మోసపోయానన్నారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయని, అయితే చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. ఏటీఎంలలో డబ్బులు లేని పాలన దేశంలో సాగుతోందని చంద్రబాబు విమర్శించారు. మోదీ వల్ల ఒక్కరికీ కూడా పైసా లాభం రాలేదన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకుల వద్ద క్యూలో నిల్చోవాల్సి వస్తుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై పైసా తగ్గించి కేంద్రం పేదవారితో పరిహాసమాడుతోందని చంద్రబాబు చెప్పారు. మోదీ సర్కారు సహకరించకున్నా మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*