మోత్కుపల్లితో ముద్రగడ భేటీ

హైదరాబాద్: ఇటీవలే టీడీపీ నుంచి బహిష్కృతుడైన తెలంగాణ మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం భేటి అయ్యారు. నర్సింహులుకు సంఘీభావం తెలిపి తాజరాజకీయలపై చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు సాగాయి. ఏపీకి రావాలని మోత్కుపల్లికి ముద్రగడ ఆహ్వానం పలికారు. యాత్రకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ముద్రగడతో పాటు మరో పది మంది నేతలు మోత్కుపల్లితో సమావేశమయ్యారు. టీడీపీ నుంచి బహిష్కరించాక మోత్కుపల్లి ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. మోత్కుపల్లి, ముద్రగడ సమావేశంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే మోత్కుపల్లి ఇటీవలే టీడీపీకి ఓటెయ్యొద్దని పిలుపునిచ్చారు. మోత్కుపల్లి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరకపోవచ్చని సమాచారం. మోత్కుపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకే ముద్రగడ సమావేశమయ్యారా అనేది తేలాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*