బుద్ధగయ పేలుళ్ల కేసులో ఐదుగురికి జీవితఖైదు

పాట్నా: 2013 నాటి బుద్ధగయలో పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఉగ్రవాదులకు జీవితఖైదు విధిస్తూ పాట్నా ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. 2013 జులై ఏడున జరిగిన బీహార్ బుద్ధగయలో వరుస పేలుళ్లు జరిగి ఏడుగురు చనిపోయారు. అనేకమంది బౌద్ధ సాధువులు గాయపడ్డారు. జీవితఖైదు పడ్డ ఇంతియాజ్ అలీ, ముజీబ్ ఉల్లా, ఒమైర్ సిద్ధిఖీ, అజారుద్దీన్ ఖురేషీ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు. మయన్మార్‌లో రొహింగ్యా ముస్లింలపై అక్కడి సైన్యం చేపట్టిన చర్యలకు నిరసనగా ఇండియన్ ముజాహిదీన్ బీహార్ బుద్ధగయలో ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఉగ్రవాదులు విచారణలో అంగీకరించారు. మయన్మార్‌లో రొహింగ్యా ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో అక్కడి సైన్యం విరుచుకుపడింది. రొహింగ్యా ఉగ్రవాదుల ఏరివేతను తీవ్రం చేయడంతో రొహింగ్యా ముస్లింలు తలదాచుకునేందుకు బంగ్లాదేశ్ సహా అనేక దేశాలకు పారిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*