అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బిపాసాబసు

బాలీవుడ్ ప్రముఖ నటి బిపాసాబసు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరింది. గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న బిపాసాను శనివారం ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇదే సమస్యతో గతంలో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ఇటీవల సమస్య మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలని భావించిన బిపాసా ఆసుపత్రిలో చేరినట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ముంబైకి చెందిన సీనియర్ పల్మనాలజిస్ట్‌ చికిత్స అందిస్తున్నారు. బిపాసా ఆసుపత్రిలో చేరిన విషయాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ ఆమెకు పరీక్షలు పూర్తయ్యాయని, చికిత్స అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*