శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొపై రూ.2వేలు తగ్గించిన శాంసంగ్

శాంసంగ్ గెలాక్సీ జే7ప్రొ ధర భారత్‌లో మరోమారు తగ్గింది. ఈ ఏడాది మార్చిలో ఈ మొబైల్‌పై రూ.2వేలు తగ్గించిన సంస్థ తాజాగా మరో రూ.2వేలు తగ్గించినట్టు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో శాంసంగ్ గెలాక్సీ జే7ప్రొను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని అసలు ధర రూ.20,900. ఈ ఏడాది మార్చిలో దీని ధరను రూ.2వేలు తగ్గించి రూ.18,900కే అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో రూ.2వేలు తగ్గించి రూ.16,900కే అందించేందుకు సిద్ధమైనట్టు ముంబైకి చెందిన ఓ మొబైల్ రిటైలర్ ద్వారా తెలిసింది. దేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ తగ్గింపు ధరతో మొబైల్ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని శాంసంగ్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

మిడ్ రేంజ్ శ్రేణిలో శాంసంగ్ గెలాక్సీ జే7ప్రొ బాగా పాప్యులర్ అయింది. స్లిమ్ మెటల్ యూనీబాడీ డిజైన్, హోమ్ స్క్రీన్ బటన్‌పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొ స్పెసిఫికేషన్లు: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 13 మెగాపిక్సల్ ముందు, వెనక కెమెరాలు, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్లు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*