
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ అర్ధరాత్రి పబ్‌లో రెచ్చిపోయిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 22న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్‌లో ఈ ఘటన చోటుచేకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, పబ్ నిర్వాహకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. 22న రాత్రి మనోజ్ పబ్‌కు వెళ్లాడు. రాత్రి 11:30 గంటలు కావడంతో నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన నటుడు సౌండ్ పెంచాలని కోరాడు. సమయం దాటిందని, సౌండ్ పెంచడం వీలుకాదని నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్ సౌండ్ సిస్టంను, స్పీకర్లను పగలగొట్టాడు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మనోజ్‌ను ప్రశ్నించారు. తాను ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడేందుకు సౌండ్ తగ్గించమని కోరానని, అంతకుమించి మరేమీ లేదని మనోజ్ పోలీసులకు చెప్పాడు. దీంతో అసలక్కడేం జరిగిందో తెలుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీలు ఇవ్వాలని కోరాగా, నిర్వాహకులు వాటిని అందించారు. అయితే, మనోజ్‌పై కేసు పెట్టేందుకు పబ్ యాజమాన్యం ముందుకు రాకపోవడంతో జనరల్ డైరీ (జీడే)లో నమోదు చేసుకుని వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Be the first to comment