అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫోన్‌ను విడుదల చేసిన వివో

చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో భారత మార్కెట్లోకి తన సరికొత్త 4జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ వై83ని లాంచ్ చేసింది. 6.22 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ ధర రూ.14,990 మాత్రమే. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తోంది. దేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో సొంత ఆన్‌లైన్ షాపింగ్ చానెల్‌లోనూ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

వివో వై83లో అత్యద్భుతమైన కెమెరాను ఉపయోగించామని, తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన ఫోన్‌ను అందిస్తుందుకు సంతోషంగా ఉందని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ అధికారి జెరోమ్ చెన్ తెలిపారు.

వివో వై83 స్పెసిఫికేషన్లు: 6.22 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే, పీడీఏఎఫ్ టెక్నాలజీతో కూడిన 13 ఎంపీ హై డెఫినిషన్ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ హీలియో పీ22 ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, 256 జీబీ వరకు అంతర్గత మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*