రూ.399 ప్యాక్‌లో ఇక రోజుకు 2.4 జీబీ.. ఎయిర్‌టెల్ మరో ఆఫర్!

టెలికం రంగంలో రిలయన్స్ జియోతో పోటీపడుతున్న భారతీ ఎయిర్‌టెల్ తన రూ.399 ప్లాన్‌ను సవరించింది. ఇప్పటి వరకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 1.4జీబీ డేటా అందిస్తుండగా ఇకపై 2.4జీబీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఇది ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమేనని తెలిపింది.

రూ.399 ప్లాన్‌లో భాగంగా కొందరు యూజర్లకు 70 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్‌ లభిస్తుండగా, మరికొందరికి 84 రోజుల కాలపరిమితి లభిస్తోంది. పెంచిన 1జీబీ డేటాను కూడా 84 రోజుల కాలపరిమితి ఉన్న ఖాతాదారులకు మాత్రమేనని ఎయిర్‌టెల్ తెలిపింది. అంటే, రూ.399 ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితి ఉన్న వినియోగదారులకు ఇకపై రోజుకు 2.4 జీబీ డేటా లభిస్తుందన్న మాట. అలాగే రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. త్వరలోనే ఈ ఆఫర్‌ను అందరికీ వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది.

రిలయన్స్ జియో రూ.399 ప్యాక్‌లో 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. జియో యాప్స్ ఉచితంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్ అందరికీ అందుబాటులో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*