కర్ణాటకలో గ్రహాంతరవాసిని బంధించారట!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో గ్రహాంతరవాసి సంచరిస్తోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రహాంతర వాసి సంచరిస్తోందంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారు. పశువుల పాకల్లో దూరి గేదెలను గాయపరుస్తోందంటూ ఫొటోలను కూడా కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రారంభంలో తేలిగ్గా కొట్టిపారేసినా క్రమంగా గ్రహాంతర వాసి వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపుతోంది. చివరకు గ్రహాంతరవాసిని చాకచక్యంగా బంధించారనే పుకారు కర్ణాటక రాష్ట్రం దాటి తెలుగు రాష్ట్రాలకు చేరుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అయితే అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*