యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉన్మాదులకు దేహశుద్ధి

గుంటూరు: డీజీపీ కార్యాలయం సమీపంలో యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉన్మాదులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ క్లబ్ వద్ద బహిర్భూమికి వెళ్లిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. యువతులపైకి మద్యం సీసాలు విసిరారు. దీంతో స్థానికులు, యువతులు ఉన్మాదులను చితగ్గొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఎంత తన్నినా ఉన్మాది భయపడకపోవడం గమనార్హం. తనను తన్నేందుకు వచ్చిన మహిళలను దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ తనను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ వీరంగం చేశాడు. ఉన్మాదులను ఇప్పటంకు చెందిన సందీప్, గుడిమెండకు చెందిన శంకర్‌రావుగా గుర్తించారు. తాగిన మైకంలో వీరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*