
అవును! గత రాత్రి అదే జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర దర్శకులందరూ ఒకే చోట కలిసి సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి సోమవారం తన ఇంట్లో నిర్వహించిన ఓ పార్టీకి రాజమౌళి నుంచి సందీప్ రెడ్డి వంగా వరకు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా కలిసి దిగిన ఫొటోను వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ‘అద్భుతమైన వ్యక్తులతో అద్భుతమైన సాయంత్రం’ అంటూ ఫొటో కింద క్యాప్షన్ రాశాడు. తన ఆహ్వానాన్ని మన్నించి ఇంటికొచ్చిన అందరికీ వంశీ కృతజ్ఞతలు తెలిపాడు. పార్టీకి హాజరైన వారిలో రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా తదితరులు ఉన్నారు.
Be the first to comment