
నటిస్తూ తెరమీద జీవించాలనుకునేవారికి ఎన్టీఆర్ బయోపిక్‌లో అవకాశం కల్పించాలని ఎన్బికే ఫిల్మ్స్ నిర్ణయించింది. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రాముఖ్యత గల పాత్రలకు కొత్తవారిని ఆహ్వానించారు. ఆసక్తి ఉన్నవారు సెల్‌ఫోన్‌తో ఫెర్ఫార్మన్స్ను షూట్ చేసిన రెండు వీడియోలను మెయిల్ చేయాలని సూచించారు. వీడియోల నిడివి 30 సెకండ్లు మాత్రమే ఉండాలని సూచించారు. దయచేసి కార్యాలయానికి రావొద్దని, మెయిల్ ద్వారానే సమాచారం తెలుసుకోవాలని సూచించారు. చిత్రయూనిట్ అనుకున్నట్లు అనిపించిన వాళ్లని ఆడిషన్స్‌కు ఆహ్వానిస్తామన్నారు. సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మెయిల్ అడ్రస్ casting.ntrbiopic@gmail.com
Be the first to comment