
న్యూయార్క్: అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మహిళా పారిశ్రామికవేత్త కేట్ స్పేడ్(55) ఆత్మహత్య చేసుకున్నారు. న్యూయార్క్‌లోని పార్క్ ఎవిన్యూలో ఉన్న తన అపార్ట్మెంట్లో ఆమె శవమై తేలారు. ఘటనాస్థలం నుంచి సుసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూయార్క్‌లో కేట్కు 140 రిటైల్ దుకాణాలున్నాయి. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 175 రీటైల్ షాపులున్నాయి. కోట్లకు పడగలెత్తిన కేట్కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Be the first to comment