
ఒకప్పుడు ఐస్ బక్కెట్ ఛాలెంజ్ బాగా పాపులర్ అయినట్లే భారత్‌లో తాజాగా ఫిట్నెస్ ఛాలెంజ్ విపరీతంగా పాపులరైంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను చాలా మంది సెలబ్రిటీలు స్వీకరించి తమ ఫిట్నెస్ మంత్రాన్ని సోషల్ మీడియా వేదికపై అందరితో పంచుకుంటున్నారు. మోన్నామధ్య కోహ్లీ కూడా రాజ్యవర్ధన్ ఛాలెంజ్‌ను స్వీకరించి తన వర్కౌట్‌ను పోస్ట్ చేసి ప్రధాని మోడీ, ధోనీతో సహా కొంతమందికి ఆ ఛాలెంజ్‌ను పాస్ చేశాడు.
ఇప్పుడది అలా అలా వ్యాపించి దక్షిణాది హీరోల వరకూ చేరింది. కొన్ని రోజుల క్రితం మళయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇలాన తనకు ఇష్టమైన వర్కౌట్ చేసి సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టి అందరికీ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను విసిరాడు. దీంతో జనతా గ్యారేజ్ మూవీలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన జూనియర్ ఎన్టీయర్ ఆ సవాల్‌ను స్వీకరించి ఫిట్నెస్ కోసం తాను రోజూ చేసే వ్యాయామాన్ని సోషల్ మీడియాలో పెట్టి కొంతమదికి ఛాలెంజ్‌ను పాస్ ఆన్ చేశాడు.
నందమూరి కళ్యాణ్ రామ్, మహేశ్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివను సవాల్ చేశాడు. దీంతో స్పందించిన రాం చరణ్ తన ఫేవరెట్ వర్కౌట్‌ను చిత్రించి పోస్ట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లతో బరువును లేపే ఎక్సర్సైజ్ చేస్తే చరణ్ గ్లౌజ్‌లు ధరించి బాక్సింగ్ బ్యాగ్‌ను చితక్కొట్టాడు. తర్వాత ఈ చాలెంజ్‌ను సుకుమార్, కేటీఆర్, వరుణ్ తేజ్, మెగాస్టార్‌కు పాస్ చేశాడు.
This post is also available in : English
Be the first to comment