డచ్ ప్రధానిని చూసి నేర్చుకోండయ్యా!

పార్లమెంటులో కాఫీ తాగుతుండగా పొరపాటున ఒలికిన కాఫీని డచ్ ప్రధాని మార్క్ రుట్ స్వయంగా శుభ్రం చేయడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. కాఫీ ఒలికిన నేలను ప్రధాని నేలను శుభ్రం చేసే తుడుపుకర్రతో శుభ్రం చేస్తుండగా దానిని వీడియో తీసిన ఫ్రెంచ్ దౌత్యవేత్త ఒకరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో అది కాస్తా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రధాని నేలను శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది చప్పట్లు కొడుతూ అభినందించారు.

ఈ మొత్తం దృశ్యాన్ని దౌత్యవేత్త సీస్ వాన్ బీక్ చిత్రీకరించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. క్షణాల్లో వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది కామెంట్లు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇక భారతీయ నెటిజన్లు అయితే దేశంలోని రాజకీయ నాయకులు మార్క్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇక మనోళ్లు కూడా క్యూడతారు అని సెటైర్లు వేస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*