ప్రపంచంలోనే అతిచిన్న 4జీ ఫోన్!

రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ స్రీన్ సైజు పెరుగుతూపోతుంటే మరోవైపు ప్రపంచంలోనే అత్యంత చిన్న 4జీ ఫోన్ వచ్చేస్తోంది. చైనాకు చెందిన యూనిహెర్ట్‌జ్ కంపెనీ 3.7 అంగుళాల పొడవైన స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికి ఆటం అని పేరు పెట్టిన కంపెనీ అద్భుతమైన ఫీచర్లను కూడా జోడిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన 4జీ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింట్ సిస్టం, ముందువైపు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వస్తున్న ఈ ఫోన్ పూర్తిగా వాటర్ ప్రూఫ్ కావడం మరో విశేషం. నీటిలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుందని, నీటి అడుగున కూడా వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 2.45 అంగుళాల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 16 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ తదితర ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర కూడా సరసంగానే ఉంటుందట. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్‌ఫోన్లకు ఇది ఏమాత్రం తీసిపోదని, ఇంకా చెప్పాలంటే వాటిల్లో లేని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయని చెబుతోంది. అంతేకాదండయ్.. డిజిటల్ పేమెంట్స్‌ ఎంచక్కా చేసుకోవచ్చంటోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఇది ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*