బిగ్‌బాస్‌ వన్ విజేత శివ బాలాజీ, టూ విజేత బాబు గోగినేని?

బిగ్‌బాస్ టూ విజేత ఎవరనేది అప్పుడే తేల్చేశారు నెటిజన్లు. షో ప్రారంభమై గంటలు కూడా గడవక ముందే విజేతను ప్రకటించేశారు. హేతువాది బాబూ గోగినేని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైంది మొదలు అంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. తన వాదంతో టీవీ ఛానెళ్లలో భీకరంగా విరుచుకుపడే బాబు గోగినేని ముందు బిగ్ బాస్ హౌస్‌లోని ఇతర పార్టిసిపెంట్స్ నిలబడలేరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనిదే తాను దేన్నీ నమ్మనని చెబుతూ గోగినేని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా లక్షల్లో ఉన్నారు. దీంతో ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. అంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఆయన గురించి ఆయన తత్వం గురించి తెలిసినవారంతా మొత్తం 16 మందిలో ఆయనకున్న నాయకత్వ లక్షణాలు, డామినేటింగ్ నేచర్ మరొకరికి లేవని, ఈ కారణంగానే ఆయనే విజేత అని అంతా ఇప్పుడే ప్రకటించేస్తున్నారు. అయితే బిగ్ బాస్‌లో ఉండే అనేక టాస్క్‌లను గోగినేని ఎలా ఎదుర్కొటారనేది ఆసక్తికరంగా మారింది. విజేతగా నిలవాలంటే, కోట్లాది ప్రేక్షకుల అభిమానం పొందాలంటే అంత సులభమేమీ కాదని గోగినేనికి కూడా తెలుసు. మరి వంద రోజులు ఆయన హౌస్‌లో ఎలా వ్యవహరిస్తారోనని అంతా చర్చించుకుంటున్నారు. విజేత ఎవరో తేలాలంటే మరో వంద రోజులు ఆగక తప్పదు మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*