బౌరంపేటలో విషాదం… ఐదేళ్ల కుమార్తెతో సహా ఉరేసుకున్న తల్లి

హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో ఐదేళ్ల పాపకు ఉరేసి తల్లి కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు అనిత భర్త శ్రీను డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు.

 

మరోవైపు ఘటనతో బౌరంపేటలో విషాదం అలుముకుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్లు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతా ఈ విషాదకర ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*