సోనాలీకి వచ్చింది మెటాస్టాటిక్ కేన్సర్.. అంటే ఏమిటి?

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తనకు కేన్సర్ సోకినట్టు చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తాను ‘మెటాస్టాటిక్ కేన్సర్’తో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆమె ప్రకటనతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విషయం తెలిసిన వెంటనే ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

‘‘కొన్నిసార్లు జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇటీవల నాకు కేన్సర్ సోకినట్టు తేలింది. పరీక్షల సమయంలో కొంత నొప్పిని అనుభవించాను. నా చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొంది.

అసలు ఇంతకీ ‘మెటాస్టాటిస్ కేన్సర్’ అంటే అర్థం ఏమిటి?

అమెరికాలోని కేన్సర్ ట్రీట్‌మెంట్ సెంటర్ ప్రకారం.. ‘‘కేన్సర్ కణాలు శరీరంలోని శోషరస వ్యవస్థ ద్వారా కానీ, రక్త ప్రసారం ద్వారా కానీ కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుంటాయి. మెటాస్టాటిక్ కేన్సర్, లేదా, మెటాస్టాటిక్ ట్యూమర్ అనేది ప్రారంభమైన ప్రాంతం నుంచి శరీరంలోని ఇతర ప్రాంతాలకు (భాగాలకు) పాకుతూ ఉంటుంది. కణాల ద్వారా ఏర్పడే కణతుల (ట్యూమర్) ను సెకండరీ ట్యూమర్స్ అంటారు. ప్రైమరీ సైట్‌కు సమీపంలో కేన్సర్ విస్తరించే అవకాశం ఉన్నదానిని రీజనల్ మెటాస్టాటిస్ అంటారు. శరీరంలోని ఇతర భాగాలు (ప్రాంతాల్లో) విస్తరిస్తే దానిని డిస్టాంట్ మెటాస్టాటిస్’’ అంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*