వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌లో ఫెదరర్‌కు షాకిచ్చిన ఆండర్సన్

లండన్‌: వింబుల్డన్-2018లో స్విట్జర్లాండ్ స్టార్ ఫెదరర్‌కు దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ షాకిచ్చాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఫెదరర్‌ను ఓడించి సెమీస్‌లోకి దూసుకుపోయాడు. 1983 తర్వాత వింబుల్డన్ సెమీఫైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఆండర్సన్ రికార్డు సృష్టించాడు. 8 సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన ఫెదరర్‌తో ఉత్కంఠగా సాగిన పోరులో 6-2, 6-7, 7-5, 6-4, 13-11 తేడాతో నెగ్గాడు. మొత్తం 4 గంటల 14 నిమిషాలపాటు ఇద్దరి మధ్యా ఫైట్ కొనసాగింది. 9వ సారి వింబుల్డన్ గెలుద్దామనుకున్న ఫెదరర్ నిరాశతో ఇంటి ముఖం పట్టాడు. మరోపోరులో సెర్బియాకు చెందిన జకోవిచ్ జపాన్ ఆటగాడు నిషికోరిను ఓడించి సెమీస్‌కు చేరాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*